Loading...

Sai Dheeraj Sharma | Vedic Astrologer |Telugu astrologer | Telugu jyothisham |

శ్రీకృష్ణీయం: ప్రశ్న శాస్త్రం ద్వారా మీ సమస్యలకు తక్షణ పరిష్కారం! (Sri Krishneeyam by Sai Dheeraj Sharma)

నమస్కారం! 🙏

జ్యోతిష శాస్త్రం అనేది ఒక మహా సముద్రం. అందులో మనకు వెంటనే ఫలితాన్ని, సమాధానాన్ని ఇచ్చే అద్భుతమైన విభాగమే “ప్రశ్న శాస్త్రం” (Prashna Shastram / Horary Astrology).

మీ దగ్గర జాతక చక్రం (Horoscope) లేకపోయినా, పుట్టిన సమయం తెలియకపోయినా.. కేవలం మీరు అడిగే “ప్రశ్న” ఆధారంగా మీ భవిష్యత్తును చెప్పగలిగే శక్తి ఈ శాస్త్రానికి ఉంది.

ఇలాంటి గొప్ప శాస్త్రాన్ని తెలుగు వారికి అత్యంత సరళంగా అందించాలనే ఉద్దేశంతో.. ప్రాచీన గ్రంథమైన “కృష్ణీయం” ఆధారంగా నేను రచించిన పుస్తకమే “శ్రీకృష్ణీయం” (Srikrishneeyam).

ఈ పుస్తకం ఎందుకు చదవాలి? (Why this Book?)

కేరళలో ప్రసిద్ధి చెందిన “అష్టమంగళ ప్రశ్న” (Ashta Mangala Prasna) విధానానికి మూలం ఈ కృష్ణీయమే. క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణ ఆచార్యులు రచించిన ఈ సంస్కృత గ్రంథాన్ని.. నేటి తరానికి అర్థమయ్యేలా, ప్రాక్టికల్ చార్ట్స్ (Practical Charts) తో సహా తెలుగులో అనువదించడం జరిగింది.

ఈ పుస్తకంలో ఏముంది?

మీ నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సందేహాలకు ఇందులో సమాధానాలు ఉన్నాయి:

• ✅ వివాహ ప్రశ్న: పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఎవరితో అవుతుంది?

• ✅ ఉద్యోగ ప్రశ్న: ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? ట్రాన్స్‌ఫర్ ఎప్పుడు?

• ✅ కార్య సిద్ధి: అనుకున్న పని జరుగుతుందా? లేదా?

• ✅ నష్ట జాతకం (Lost Items): పోయిన వస్తువులు దొరుకుతాయా? దొంగ ఎవరు?

• ✅ ఆగమన చింత: దూర దేశం వెళ్ళిన వారు ఎప్పుడు తిరిగి వస్తారు?

• ✅ ధాతు మూల జీవ చింత: మనసులో అనుకున్నది మనిషా? వస్తువా? జంతువా?

రచయిత గురించి (About Author – Jallavarapu Sai Dheeraj Sharma)

నేను, జల్లవరపు సాయి ధీరజ్ శర్మ, ఒక జ్యోతిష విద్యార్థిగా మరియు సాధకుడిగా.. మన సనాతన ధర్మంలోని విజ్ఞానాన్ని అందరికీ పంచాలనే సంకల్పంతో ఈ గ్రంథాన్ని రచించాను.

ఈ పుస్తకానికి శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతి స్వామివారు అలాగే అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామివారు మరియు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ (సహస్రావధాని) గార్లు ఆశీస్సులు అందించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను

Scroll to Top